సహకార సంఘాల వార్ : మాజీ సర్పంచ్ దారుణ హత్య
తెలంగాణలో గత కొన్ని రోజులుగా సహకార సంఘాల ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ సహకార సంఘాల ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక రాజకీయాల్లో హీటెక్కాయి. సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్ణణ వాతావారణం ఓ వ్యక్తి హత్య చేసేదాక వెళ్లింది. సూర్యపేట జిల్లా ఎక్కారంలో ఈ ఘటన జరిగింది.
ఎక్కారం మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. ఒంటెద్దు వెంకన్నను రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. సహకార ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల నుంచి గ్రామంలో రాజకీయ కక్షలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.