ఘనంగా నితిన్ నిశ్చితార్థ వేడుక
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడుకాబోతున్నాడు. నితిన్ గత నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం పెద్దలు చెబితే వారు ఓకే అన్నారు. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నితిన్-షాలిని పెళ్లికి రెడీ అయ్యారు. శనివారం హైదారాబాద్ లో నితిన్ నివాసంలో నిశ్చితార్థ వేడుక నిడారంబంగా జరిగింది.
ఈ వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇంకా చెప్పాలంటే కుటుంబ వేడుకగా నిశ్చితార్థ వేడుకని నిర్వహించారు. దీనికి సంబంధించిన రెండు ఫోటోలని నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “పెళ్లి పనులు మొదలయ్యాయ్.. మ్యూజిక్ స్టార్ట్.. మీ ఆశీస్సులు కావాలి” అని రాసుకొచ్చారు. ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా నిర్వహించబోతున్నట్టు సమాచారమ్.
ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ కడుముల దర్శకుడు. నితిన్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఈ నెల 21న భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు రంగ్ దే, చందశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూడు సినిమాలు ఈ యేడాదియే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.