ఫిలింఫేర్‌ ఆవార్డ్స్ వివాదం.. సల్మాన్ వీడియో వైరల్ !

అస్సాంలోని గువాహటిలో ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్‌ ఆవార్డు ల కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రతిభ వంతులను కాదని.. అనర్హులకు 65వ ఫిలింఫేర్‌ అవార్డులు ఇచ్చారంటూ సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘బైకాట్‌ ఫిలింఫేర్‌ అవార్డ్స్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 

ఈ నేపథ్యంలో గతంలో ఫిలింఫేర్‌ అవార్డులకు వ్యతిరేకంగా మాట్లాడిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘ఎవరికైతే వారిపై వారికి నమ్మకం ఉండదో అలాంటి వారు మాత్రమే అవార్డులను ఆశిస్తారని నా అభిప్రాయం. కానీ.. నేను ఫలింఫేర్‌, ఇతర ఎలాంటి పిచ్చి ఆవార్డులను తీసుకోను. కేవలం గౌరవప్రదమైన జాతీయ అవార్డును మాత్రమే ఆశిస్తాను. దాన్ని మాత్రమే తీసుకుంటాను’ సల్మాన్ చెప్పాడు.

 సల్మాన్ వీడియోపై పలువురు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ‘మీకు మా అభినందలు సల్మాన్‌ జీ’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. ‘మరీ డబ్బుల కోసం ఈ అవార్డుల కార్యాక్రమాలకు హాజరవుతున్నారు కదా! అంటూ చురకలంటిస్తున్నారు. ఇక, ఈ ఏడాది ఫిలింఫేర్‌ అవార్డుల్లో బాలీవుడ్‌ రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌లు నటించిన ‘గల్లీబాయ్‌’ చ్రితానికి అవార్డుల పంట పండింది. ఈ ఒక్క సినిమాకే పలు విభాగాల్లో మొత్తం 13 అవార్డులు వచ్చాయి.