అందుకే ‘జెర్సీ’ని వదులుకొన్నా : రస్మిక 


నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. నానికి జంటగా శ్రద్దా దాస్ నటించింది. ఇప్పుడీ సినిమాలో బాలీవుడ్ లో రిమేక్ అవుతోంది. షాహిద్ కపూర్  హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా ముందుగా రస్మికనే అనుకొన్నారు. ఆమెని సంప్రదించారు కూడా. మరీ.. జెర్సీ ఆఫర్ ని రస్మిక ఎందుకు రిజెక్ట్ చేసినట్టు ? దానికి భీష్మ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రస్మిక సమాధానం ఇచ్చింది. 

” ‘జెర్సీ’ రీమేక్‌ ఆఫర్‌ వచ్చినప్పుడు.. నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. డేట్స్‌ కుదరకపోవడం వల్లే నేను ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది” అని రస్మిక చెప్పుకొచ్చింది. ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం భీష్మ సినిమాలో నటిస్తోంది. ఈ నెల 21న భీష్మ ప్రేక్షకుల ముందుకు రానుంది.