స్టార్ హీరోల యాక్షన్ వార్

హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో స్టార్ హీరోల యాక్షన్ వార్ నడుస్తోంది. కింగ్ నాగార్జున, చియాన్ విక్రమ్, సూపర్ స్టార్ రజనీకాంత్ లు రామోజీ సిటీలో యాక్షన్ చేస్తున్నారు. నాగ్ ఎన్ ఐ.ఎ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకుడు. ఇందులో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపిస్తారు. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఇల్లు సెట్ వేశారు. ఇందులో నాగార్జున, సయామీ ఖేర్ తదితరులపై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

శివ దర్శకత్వంలో రజనీ 168వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, మీనా, ఖుష్బు నాయికలు. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. పబ్ నేపథ్యంలో సాగే పోరాట ఘట్టాల్ని రజనీకాంత్ తదితరులపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ మూడు పాత్రల్లో నటించనున్నారు. ఇక మణిరత్నం మల్టీస్టారర్ ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, జయం రవి, త్రిష, ప్రభు, అదితి రావ్ హైదరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చారిత్రక నేపథ్య చిత్రమిది. ఈ చిత్రంలోనిసన్నివేశాల చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఓడను తీర్చిదిద్దారు. అందులోనే ప్రస్తుతం కార్తి, జయం రవి తదితరులపై పోరాట సన్నివేశాలను తీస్తున్నారు.