రస్మికపై కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలు


టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందనని కలెక్టర్ గెలికాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగిత్యాల కలెక్టర్ రవి గుగులోత్ ట్విట్టర్ ఖాతాలో హీరోయిన్ రష్మిక మందన ఫోటో ఒకటి షేర్ చేశారు. దానికి ‘చించావ్ పో రస్మిక.. ‘ అనే కామెంట్ పెట్టారు. దీంతో కలెక్టర్ రవి హీరోయిన్ రస్మికపై మనసుపారేసుకొన్నారేమో అనే కామెంట్స్ వినిపించాయి.

దీనిపై కలెక్టర్ రవి స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ గురైందని.. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. మరోవైపు, కలెక్టర్ ట్విట్టర్ ఖాతాని మరో వ్యక్తి ఆపరేట్ చేస్తారని.. బహుశా.. అతడే ఇలాంటి కామెంట్ పెట్టాడా.. ? లేదా నిజంగానే కలెక్టర్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కి గురైందా.. ? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఇక జగిత్యాల జిల్లా కలెక్టర్ గా రవి గుగులోకి మంచి పేరుంది.