రివ్యూ : భీష్మ – బ్లాక్ బస్టర్
చిత్రం : భీష్మ (2020)
నటీనటులు : నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, సంపత్ రాజ్, వీకే నరేష్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: సాగర్ మహతి
దర్శకత్వం : వెంకీ కుడుముల
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
రిలీజ్ డేటు : 21 ఫిబ్రవరి, 2020
రేటింగ్ : 3.5/5
యంగ్ హీరో నితిన్ కి అపజయాలు కొత్తేమీ కాదు. ఏకంగా డజను ప్లాపులతో తర్వాత ‘ఇష్క్’ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ‘అఆ’ తర్వాత మరోసారి ప్లాపుల్లోకి వెళ్లాడు. ఆయన నటించిన లై, ఛల్ మోహనరంగ, శ్రీనివాస కల్యాణం సినిమాలు నిరాశపరిచాయ్. ఈ నేపథ్యంలో యేడాది పాటు గ్యాప్ తీసుకొని ఆయన చేసిన సినిమా ‘భీష్మ’. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కడుముల దర్శకత్వం వహించారు. రష్మిక మందన హీరోయిన్. భారీ అంచనాల మధ్య భీష్మ శివరాత్రి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. భీష్మ కథ ఏంటీ ? ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
8వేల కోట్ల విలువ చేసే భీష్మ ఆర్గానిక్స్ కంపెనీ అధిపతి భీష్మ (అనంత నాగ్). ఆయన తన కంపెనీకి కొత్త సీఈఓని నియమించే పనిలో ఉంటాడు. అర్హత లకన్నా కూడా నాణ్యమైన వ్యక్తి అయితేనే తన సంస్థ లక్ష్యాలను నెర వేర్చుతాడనేది ఆయన ఆలోచన. అయితే.. ఎవరూ ఊహించని రీతిలో డిగ్రీ కూడా పాస్ కాని భీష్మ (నితిన్) ఆ కంపెనీకి సీఈఓగా ఎంపికవుతాడు. 30 రోజుల్లో అర్హతని నిరూపించుకోవాలన్నది షరతు. ఇంతకీ ఆ భీష్మకీ, ఈ భీష్మకీ మధ్య సంబంధ మేమిటి? సీఈఓ స్థానంలో కూర్చున్న ముప్పై రోజుల్లో జూనియర్ భీష్మ ఏంచేశాడు? ఛైత్ర (రష్మిక)తో ఎలా ప్రేమలో పడ్డాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
* వినోదం
* నితిన్, రష్మికల నటన
* స్క్రీన్ ప్లే
* నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
* ఎమోషన్స్ మిస్
* విలన్ పాత్ర బలంగా లేకపోవడం
ఎవరెలా చేశారు ?
వినోదమే ప్రధానం అంటున్నారు ప్రేక్షకులు. అలాంటి వారిని భీష్మ బాగా మెప్పించేశాడు. పెద్దగా లక్ష్యం లేని కుర్రాడు. ప్రేమకోసం తప్పించే కుర్రాడికి అర్గానికి ఫామింగ్ లాంటి సీరియస్ సబ్జెక్ట్ కి లింక్ చేయడం ఆకట్టుకుంది. తొలి సినిమా ‘ఛలో’తోనే తన ప్రధాన బలం వినోదమేనని దర్శకుడు వెంకీ కడుముల చూపించాడు. రెండో సినిమా భీష్మ కోసం దాన్నే నమ్ముకొన్నాడు. రిటీన్ లవ్ స్టోరీ, తెలిసిన ఆర్గానికి ఫామింగ్ నే అయినా.. దానికి వినోదం అనే కొట్టింగ్ వేసి.. ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీశాడు. సక్సెస్ అయ్యాడు.
భీష్మగా నితిన్ నటన బాగుంది. మొదట్లో అల్లరి చిల్లరగా కనిపిస్తూ వినోదం పంచాడు. సీఈవో మారిన తర్వాత హుందాగా కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరింది. భీష్మగా నితిన్‌లో కొత్త కోణం కనిపించిందని చెప్పవచ్చు. వెన్నెల కిషోర్ కలిసి నితిన్ చేసిన కామెడీ సినిమాకే హైలైట్. ఇక నితిన్-రస్మికల కెమిస్ట్రీ బాగుంది. రస్మిక ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ పరిమిళ్ అనే పాత్రలో బాగా నవ్వించారు. రఘుబాబు, బ్రహ్మాజీ, నరేష్, సంపత్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. జిషుసేన్ గుప్తా ప్రతినాయకుడిగా కనిపిస్తాడు. ఆయన పాత్రలో బలంగా లేదు. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సాయిశ్రీరామ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్ అందించిన పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో నేపథ్య సంగీతం బాగా హైలైట్ అయింది. వెంకీ కుడుముల మాటలు, కథనం పరంగా మెప్పిస్తాడు. వెంకీ కడుముల త్రివిక్రమ్ ని ఫాలో అయినట్టు.. నితిన్ ఆయన బాస్ పవన్ కల్యాణ్ ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది.
చివరగా : భీష్మ.. బాగా నవ్విస్తాడు
రేటింగ్ : 3.5/5