‘ఫైటర్’ టైటిల్ మారనుందా ?

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఫైటర్ (వర్కింగ్ టైటిల్). అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఛార్మితో కలిసి పూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాని భారీగా తీసుకొస్తున్నారు. ఏకంగా రూ. 50కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. పూరి సినిమా ప్రేక్షకులకి షాక్ ఇచ్చేలా ఉంటుందని ఇదివరకే విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ ‘ఫైటర్’ని మార్చబోతున్నట్టు సమాచారమ్. ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే తెలుస్తోంది. ఈ టైటిల్ వెనుక ఆసక్తికరమైన కథ ఉండటంతోనే ‘లైగర్‌’ని ఖారారు చేద్దామనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది.