ఆ డ్రెస్ లో ప్రియాంక అందంగా ఉంది : కత్రినా
ప్రతి యేడాది హలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మంగా నిర్వహించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా స్కీన్, వైట్ కలర్‌లో ఉండే ఓ డ్రెస్‌ను ధరించి తన భర్త నిక్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆమె ధరించిన డ్రెస్ బాగోలేదంటూ పలువురు నెటిజన్లు ప్రియాంక గురించి సోషల్‌మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రాకు కత్రినాకైఫ్ మద్దతుగా నిలిచింది.
తాజాగా కత్రినాను ఓ ఆంగ్ల పత్రిక వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా ప్రియాంక గ్రామీ లుక్ గురించి వస్తున్న ట్రోల్స్‌పై స్పందించమని విలేకరి కోరగా.. కత్రినా స్పందించింది. “ప్రియాంక గ్రామీ లుక్ గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో నాకు నిజంగా తెలియదు. నేను ఆమె ఫొటోలు చూశాను. ఆ డ్రెస్‌లో తను చాలా అందంగా ఉందనిపించింది. నాకు తెలిసినంతవరకూ ప్రియాంక గురించి ట్రోల్స్ చేస్తున్న వాళ్లు ఆమె గ్రామీ లుక్‌కు సంబంధించిన ఫొటోలను సరిగ్గా చూసినట్లు లేరనిపిస్తుంది” అని కత్రినా తెలిపారు.