పలాస1978 : ‘బావొచ్చాడు..’ సాంగ్ వచ్చేసింది

పెద్ద బ్యానర్స్ ని ఆకర్షించిన చిన్ని చిత్రం ‘పలాస 1978’. ద్రోణ చిత్ర దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందు లో లండన్ బాబులు ఫేమ్ రక్షిత్ హీరో గా నటిస్తున్నాడు. సంగీత దర్శకుడు రఘు కుంచే విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారం గా తెరకెక్కిన చిత్రమిది.

అల్లు అరవింద్- యూవీ క్రియేషన్స్ తో కలిసి రిలీజ్ చేస్తున్నారు. వచ్చేనెల 6వ తేదీన పలాస 1978 ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ సినిమా నుంచి  ‘బావొచ్చాడు.. ‘ ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర జానపదం ఇది. ఈ పాటని అతిథి బావరాజు పాడారు. రఘు కుంచె సంగీతం అందించారు. ఈ జానపద గీతాన్ని మీరు వినేయండీ.. !