‘భీష్మ’ రెండ్రోజుల కలెక్షన్స్ 

భీష్మగా థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన జంటగా చిత్రం భీష్మ. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి. తొలిరోజు భీష్మ రూ. 6.4కోట్ల షేర్ ని వసూలు చేసింది. రెండోరోజు ఆ హవా ఏమాత్రం తగ్గలేదు. రెండోరోజు రూ. 4.5కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. రెండ్రోజుల్లోనే భీష్మ కలెక్షన్స్ రూ.10కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఏరియాలవారీగా చూస్తే..  నైజాం : రూ. 4.19 కోట్లు, సీడెడ్ రూ. 1.4 కోట్లు, గుంటూరు రూ. 1.26 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.2 కోట్లు, తూర్పు గోదావరి రూ. 92 లక్షలు, పశ్చిమ గోదావరి రూ. 71 లక్షలు, కృష్ణ రూ. 68 లక్షలు, నెల్లూరు రూ. 37 లక్షలు వసూలు చేసింది. మరోవైపు, హిట్ టాక్ తో భీష్మ చిత్రబృందం సెలబ్రేషన్స్ మొదలెట్టింది. శుక్రవారం కేక్ కట్ చేసి పండగ చేసుకుంది.