పవన్ ఎఫెక్ట్ : ట్రంప్’తో విందుకు సీఎం జగన్ కు ఆహ్వానం లేదు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకి రాబోతున్నారు. రేపు, ఎల్లుండి కూడా ట్రంప్ భారత్ లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ నెల 25న రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్రంప్ కి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆహ్వానం అందింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడా ట్రంప్ తో విందుకు ఆహ్వానం అందింది. కానీ ఏపీ సీఎం జగన్ ఆహ్వానం రాలేదు.
దీనికి కారణం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. ? ట్రంప్ తో విందుకు దాదాపు 90 మందికి ఆహ్వానం అందినట్టు సమాచారం. కేసీఆర్ తో పాటు అసోం, హరియాణా, కర్ణాటక, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది.
బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాలు, తటస్థులకు మాత్రమే వ్యూహాత్మకంగా ఆహ్వానాలు వెళ్లాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే వైకాపా భాజాపాకి దోస్తానా పార్టీ కాదా ? అంటే.. కాదు. ఎందుకంటే ? ఇటీవలే జనసేన-భాజాపాల మధ్య పొత్తు కుదిరింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రకటించేశాయ్. ఈ నేపథ్యంలో.. ట్రంప్ విందుకు సీఎం జగన్ కి ఆహ్వానం అందలేదని చెప్పుకొంటున్నారు.