‘బాహుబలి’ వీడియోని ట్విట్ చేసిన ట్రంప్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు భారత పర్యటనకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొత్త వీడియో, పోస్టర్స్ పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని వైరల్ అవుతున్నాయ్. వీటిలో ఓ నెటిజన్ క్రియేటివిటీ ట్రంప్ ని ఆకర్షించింది. 

ఓ నెటిజన్ ‘బాహుబలి’లోని ‘సాహోరే బాహుబలి.. ‘ సాంగ్ ను మార్ఫింగ్ చేసి విడుదల చేశాడు. ప్రభాస్ ఫేస్ కు ట్రంప్ ఫేస్ అతికించారు. అలాగే మధ్య మధ్యలో కూతురు ఇవాంకా, కుమారుడు జూనియర్ డోనాల్డ్ ను చూపించి నవ్వులు పూయించాడు. ఈ వీడియోను ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గామారింది.