ఇండియాను అమెరికా ప్రేమిస్తోంది : ట్రంప్

ఇండియాని అమెరికా ప్రేమిస్తోంది అన్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత పర్యటనకి వచ్చిన ట్రంప్ మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇండియాను అమెరికా ప్రేమిస్తోంది. భార‌త్‌ను అమెరికా ప్రేమిస్తుంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు మెలానియా, నేను 8వేల కిలోమీట‌ర్ల దూరం నుంచి వ‌చ్చిన‌ట్లు ట్రంప్ చెప్పారు.

ఈ టూర్ లో భారత్ తో చేసుకోనున్న కీలక ఒప్పందాలపై ట్రంప్ ప్రకటన చేశారు. అమెరికా వ‌ద్ద భార‌త్ హెలికాప్ట‌ర్లు కొనుగోలు చేయ‌నుంది. మూడు బిలియ‌న్ల డాల‌ర్ల ర‌క్ష‌ణ ఒప్పందం కుదుర్చుకోనుందని ట్రంప్ తెలిపారు. ఇక త‌న‌కు స్వాగతం పలికిన తీరుపట్ల ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆతిథ్యాన్ని త‌న కుటుంబం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌న్నారు.

అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు గుప్పించారు. ప్ర‌ధాని మోదీ.. మీరు గుజ‌రాత్‌కు మాత్ర‌మే గ‌ర్వకార‌ణం కాదు. క‌ఠోర శ్ర‌మ‌కు మీరు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తార‌ని కొనియాడారు. ఈ న‌గ‌రంలోనే  టీ అమ్మిన వ్య‌క్తి.. ఈ దేశాన్ని ఏలుతున్న తీరు అద్భుతం అన్నారు.  ట్రంప్ తన ప్రసంగంలో బాలీవుడ్ సినిమాలు, భాంగ్రా నృత్యాలు, క్లాసిక్ సినిమాలైన డీడీఎల్‌, షోలేల‌ను గుర్తు చేశారు.