‘భీష్మ’ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే ?

భీష్మ బాక్సాపీస్ దగ్గర అదరగొడుతున్నాడు. తొలి వీకెండ్ పూర్తయ్యేలా రూ. 14.9కోట్ల షేర్ ని రాబట్టాడు. వెంకీ కడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన భీష్మ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

తొలి రెండ్రోజుల్లోనే భీష్మ రూ. 10కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ఆదివారం ఒక్కరోజే రూ. 4.9కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా భీష్మ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే.. నైజాం రూ. 6.02 కోట్లు, సీడెడ్ రూ. 2.1 కోట్లు, గుంటూరు రూ. 1.5 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1.8 కోట్లు, తూర్పు గోదావరి రూ. 1.2 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 88.5 లక్షలు, కృష్ణ రూ. 99 లక్షలు, నెల్లూరు రూ. 48 లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.