ఎవరికీ లంచం ఇవ్వొద్దు.. !

తెలంగాణ ప్రభుత్వం పట్టణాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘పట్టణ ప్రగతి’ని నిర్వహిస్తోంది. సోమవారం మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీపై ప్రజల్లో ఉన్న అపవాదులు తొలగించి.. లంచం లేని, సమస్యల్లేని సకల వసతులున్న పచ్చని పట్టణాలుగా ప్రతి మున్సిపాలిటీని తీర్చిదిద్దడమే ‘పట్టణ ప్రగతి’ లక్ష్యమన్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరికీ లంచం ఇవ్వొద్దని సూచించారు.

10 రోజుల ‘పట్టణ ప్రగతి’లో చేపట్టాల్సిన పనులు, కమిటీలు, కౌన్సిలర్ల బాధ్యతలు, అధికారుల విధినిర్వహణపై మంత్రి దిశానిర్దేశం చేశారు. సిరిసిల్లలో తడి, పొడి చెత్తలను ప్రజలే వేరు చేసి ఇవ్వడం ద్వారా నెలకు రూ.3లక్షల ఆదాయం సమకూరుతోందని కేటీఆర్‌ వివరించారు. పాలమూరులోను అది అమలు చేయాలి. పాలమూరులోనూ తడి, పొడి చెత్తలను వేరు చేయాలని, అలా చేయని ఇళ్ల నుంచి భవిష్యత్తులో చెత్త సేకరించవద్దని సిబ్బందికి ఆదేశిస్తామన్నారు.