చరిత్ర రిపీట్ అయింది : మోడీ 

చరిత్ర రిపీట్ అయిందన్నారు ప్రధాని మోడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకి విచ్చేశారు. ఈ సందర్భంగా మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ఈ నేల గుజ‌రాత్‌ది. కానీ జోష్ మాత్రం ఇండియాద‌న్నారు. ఈ ఉత్సాహాం ఆకాశం అంతా ద‌ద్ద‌రిల్లుతోంద‌న్నారు. 

ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేడియం వ‌ర‌కు.. భార‌తీయ సాంప్ర‌దాయ నృత్యాలు మారుమోగాయ్. మొతెరా స్టేడియంలో కొత్త చ‌రిత్ర ఆరంభ‌మైంది. చ‌రిత్ర రిపీటైంది. 5 నెల‌ల క్రితం అమెరికాలో “హౌడీ మోదీ” టూర్ చేశా.. ఇప్పుడు నా స్నేహితుడు ట్రంప్‌ “న‌మ‌స్తే ట్రంప్” ఈవెంట్‌లో భాగంగా భారత్ కు వచ్చారు. అతిపెద్ద ప్ర‌జాస్వామ్యం మిమ్ముల్ని స్వాగ‌తిస్తోంద‌న్నారు మోడీ. ఇండియా, అమెరికా బంధం.. కేవ‌లం ఓ భాగ‌స్వామ్యమే కాదు అని, ఇది మ‌రింత సన్నిత‌మైన స్నేహంగా మారింద‌న్నారు.