పాక్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అహ్మ‌దాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ ఆసక్తికర ప్రసంగం చేశారు. భారత్ ని అమెరికా ప్రేమిస్తోందని స్నేహ హస్తం అందజేశారు. అదే సమయంలో దాయాదిదేశం పాకిస్థాన్ తోనూ తత్సంబంధాలున్నాయని పేర్కొనడం విశేషం. ఉగ్రవాదాన్ని నిలువ‌రించేందుకు అమెరికా-భార‌త్ క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయ‌నున్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ఉగ్ర‌వాద భావ‌జాలానికి వ్య‌తిరేకంగా అమెరికా పోరాటం చేస్తోంది. పాకిస్థాన్‌ను క‌ట్ట‌డి చేశాం. ఉగ్ర కార్య‌క‌లాపాల‌ను పాక్ త‌గ్గించే విధంగా చూశాం. బోర్డ‌ర్‌లో ఆప‌రేట్ చేస్తున్న మిలిటెంట్ల‌ను అదుపు చేయాల‌ని పాక్‌ను హెచ్చ‌రించిన‌ట్లు ట్రంప్ తెలిపారు. అదే సమయంలో ప్ర‌స్తుతం పాక్ తో మంచి సంబంధ‌మే ఉంది. ఆ దేశంతో సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక భారత్-పాక్ వైరాన్ని ప్రస్తావించారు. పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉత్కంఠ ప‌రిస్థితి త‌గ్గుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. స్థిర‌త్వం సాధిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ద‌క్షిణాసియాలో శాంతి విక‌సిస్తుంద‌న్న భావాన్ని ట్రంప్ వినిపించారు. భారత పర్యటనలో ట్రంప్ పాక్ పై ప్రేమని కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో సుతిమెత్తని హెచ్చరిలు కూడా చేశారు.