హిందీలో ట్రంప్ ట్విట్.. మోడీ రియాక్షన్ !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతగడ్డపై అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో మోడీ భారతలో అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా తన రాకపై ట్రంప్ ట్విటర్‌లో ఒక అప్‌డేట్ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్‌ను హిందీలో పోస్ట్ చేయడం విశేషం. ‘భారత్‌ను సందర్శించేందుకు ఆతృతగా ఉన్నాను. నేను దారిలో ఉన్నాను. కొద్ది గంటల్లో మీ అందర్నీ కలుస్తా’ అని ట్రంప్ హిందీలో రాసుకొచ్చారు. దానికి రిప్లై అన్నట్టుగా ప్రధాని మోడీ ఓ ట్విట్ చేశారు. ‘అతిథి దేవో భవ:’ అంటూ మోడీ ట్విట్ చేశారు.
ఇక డొనాల్డ్ ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. మరికాసేపట్లో ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నర్, ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం నేరుగా అహ్మదాబాద్ చేరుకోనుంది. వీరికి మోదీ స్వయంగా స్వాగతం పలకనున్నారు. అహ్మదాబాద్ నుంచి మోదీ, ట్రంప్ భారీ రోడ్ షోలో పాల్గొననున్నారు.
हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते में हैँ, कुछ ही घंटों में हम सबसे मिलेंगे!
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020
अतिथि देवो भव: https://t.co/mpccRkEJCE
— Narendra Modi (@narendramodi) February 24, 2020