‘హిట్’ హైలైట్ సీన్ వదిలారుగా !

కొత్త దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్’. ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మించారు. అ! తర్వాత నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ఇది. ఈ వారమే (ఫిబ్రవరి 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా 4:39నిమిషాల నివిడి గల ఓ టీజర్ లాంటి వీడియోని రిలీజ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని వెతికే సీన్ ఇది.

ఇందులో విశ్వక్ సేన్ చూపించిన ఇంటిలిజెన్స్ ఆకట్టుకుంటోంది. ఓ మూడు పిచ్చి మొక్కలు ఎక్కడ కలిసి మొలిశాయో.. అక్కడే తొవ్వండని చెబుతాడు. చెప్పినట్టుగానే అక్కడే మృతదేహం బయటపడుతుంది. అదెలా చెప్పాడు ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఈ సీన్ అదిరిపోయింది. సినిమా హైలైట్ సీన్స్ లో ఇదొకటిలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా తొలి 15నిమిషాలు ఓపిక పట్టండి.. ఆ తర్వాత సినిమా మిమ్మల్ని నిలబెడుతోంది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విశ్వక్ సేన్ చెప్పిన సంగతి తెలిసిందే.