కోహ్లీ, బుమ్రా.. ఇలా కట్టడి చేశారు !

ఒకరేమో పరుగుల యంత్రం. మరొకరేమో పేసుగుర్రం. వీరే కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్మీత్ బుమ్రా. వీరిద్దరిని కట్టడి చేయడంలో న్యూజిలాండ్ జట్టు వ్యూహాలు ఫలించాయి. ఇంతకీ వీరిపై కివీస్ ఆటగాళ్లు పన్నిన వ్యూహాలు ఏంటీ.. ? కివీస్ పేసర్లు మూకుమ్మడి ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతుల్ని స్వింగ్ చేస్తూ కోహ్లీ బ్రేకింగ్ పాయింట్ ను స్పర్శించారు. అరంగేట్రం చేసిన జేమీసన్ తో కలిసి సౌథీ, బౌల్ట్  అడ్డుకో వ్యూహంని పక్కగా అమలు చేశారు. 7 సార్లు అతడిని క్యాచ్ ఔట్ చేశారు.

స్పిన్నర్లు సైతం అతడి బలహీనతను సొమ్ము చేసుకున్నారు. ఇష్ సోధి వేసిన లెగ్ బ్రేక్ కు స్టంప్స్ ఎగరడాన్ని విరాటే నమ్మలేకపోయాడు. ఇలా కీలకమైన కోహ్లీని కుదురుకోకుండా చేసి భారత్ బ్యాటింగ్ లైనప్ ను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేశారు. ఇక రేసుగుర్రం బుమ్రా విషయంలోనూ కివీస్ వ్యూహాలు ఫలించాయ్.

వన్డే సిరీసులో బుమ్రాకి ఒక వికెట్ ఇవ్వలేదు. దాంతో 30 ఓవర్లు విసిరిన ఈ పేసుగుర్రం 0/53, 0/64, 0/50తో నివ్వెరపరిచాడు. తొలి టెస్టులో 88 పరుగులిచ్చి 1 వికెట్టే తీశాడు. అదీ తొలి ఇన్నింగ్స్ ఆఖర్లో. తికమక పెట్టే అతడి బౌలింగ్ ను విస్మరించింది. పరుగులు రాకున్నా సరే వికెట్లు ఇవ్వలేదు. మిగతా వారిపై దాడి చేసింది.