మైత్రీ మూవీస్ త్రివిక్రమ్ ముక్కుపిండీ మరీ.. !

దర్శకుడు త్రివిక్రమ్ వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. ‘అజ్జాతవాసి’ కాపీ రైట్స్ విషయంలోనూ ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాలేదు. చాలా తెలివిగా సెట్ చేసుకున్నారు. కానీ, మైత్రీ మూవీస్ మాత్రం త్రివిక్రమ్ ని వివాదంలోకి లాగేసింది. అప్పట్లో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ఉద్దేశంతో చాలా మందికి అడ్వాన్స్ లు ఇచ్చింది మైత్రీ మూవీస్. ఇందులో త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఆయనకి రూ. 4కోట్ల అడ్వాన్సులు ఇచ్చింది. అది మహేష్ తో సినిమా చేయాలని. కానీ, అజ్ఝాతవాసి ప్లాప్ తర్వాత నానితో ఓ సినిమా చేయమని మైత్రీ వారు అడిగారు. త్రివిక్రమ్ మాత్రం అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేశారు.

రూ.4కోట్లకి రూ. 8కోట్లు.. అంటే డబుల్ ఇస్తానని త్రివిక్రమ్ చెప్పాడట. కానీ, మైత్రీ వారు ఇంకా ఎక్కువ అడిగారట. ఇప్పుడీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ గా రూ. 11కోట్లు ఇచ్చేందుకు త్రివిక్రమ్ ఓకే చెప్పారు. మైత్రీ మూవీస్ మాత్రం రూ. 16కోట్లు అడుగుతున్నారట. గతంలో రూ. 12కోట్లు అడిగిన వారు.. ఇప్పుడు ఏకంగా రూ. 16కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారంట. అంటే.. రూ. 4కోట్లకి నాలుగొంతులు అన్నమాట. మరీ.. ఈ వివాదం ఎప్పుడు ? ఎంతకి? సెట్ అవుతుంది అన్నది చూడాలి.