వైకాపా నుంచి పెద్దల సభకు ఎవరు ?

రాజ్యసభ ఎన్నికలకి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 17 రాష్ట్రాల్లో 55 స్థానాలకి గానూ ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయనికొస్తే.. ఏపీ 4, తెలంగాణలో 2 స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగుకి నాలుగు స్థానాలు వైకాపాకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎవరు ? అనే చర్చ మొదలైంది.

రాష్ట్ర శాసనమండలిని రద్దుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఇప్పుడే రాజ్యసభకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మరోవైపు, బీద మస్తాన్ రావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితర పేర్లు కూడా వినిపిస్తున్నాయి.