‘ఆనందం’ మళ్లీ వస్తానంటోంది !

ఆనందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక రేఖ. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సీనియర్ హీరోయిన్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొంది. ఆసక్తికర విషయాలు పంచుకుంది. కేవలం నాగార్జున గారి కోసమే ‘మన్మథుడు’ సినిమాలో అతిథి పాత్ర చేశాను. అప్పుడు ఆయన నాకు ఒక మాటిచ్చారు. ఈ సినిమాలో అతిథి పాత్ర మాత్రమే. తర్వాత మనిద్దరం కలిసి ఫుల్ మూవీ చేద్దామన్నారు. ఇప్పటివరకూ ఆ ప్రామిస్ ను నెలబెట్టుకోలేదని చెప్పారు.

అంతేకాదు.. మణిరత్నం సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో నన్ను సరిగా ఎవరూ గైడ్ చేయలేదు. అది చేసి ఉంటే తమిళంలో బాగా బిజీగా అయ్యేదాన్నేమో. కానీ, కన్నడలో అందరు పెద్ద హీరోలతో చేశానని చెప్పుకొచ్చింది రేఖ. ఇక తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాని తెలిపింది. ఎలాంటి పాత్రైనా చేయడానికి రెడీ. ఆఖరికి వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా సిద్ధమని రేఖ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అన్నట్టు.. ఈ ముద్దుగుమ్మకి జింక పిల్ల అనే పేరు కూడా ఉంది. కన్నడలో ఆమెని ఆ పేరుతోనే పిలుస్తారట.