అమిత్ షా రాజీనామా డిమాండ్

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా డిమాండ్ తెరపైకి వచ్చింది. సీఏఏపై ఆందోళనలు సద్దుమణుగుతున్న వేళ అమిత్ షా చేసిన వ్యాఖ్యల కారణంగానే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్ని పరిస్థితుల్లో దేశంలో సీఏఏని అమలు చేసి తీరుతామని ఇటీవల అమిత్ షా అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా అల్లర్లకి ఆయనే కారణమని విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమిత్ షా రాజీనామా చేయాలని హైదరాబాద్ హిమాయత్ నగర్ చౌరస్తాలో సీపీఐ నాయకులు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సీపీఐ నాయకులు అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. మరోవైపు, పలువురు జాతీయ నేతలు అమిత్ షా రాజీనామాపై పట్టుబడుతున్నారు.