జనసేన ఎమ్మెల్యే విచిత్ర మాటలు
జనసేన పార్టీ తరుపున ఏకైన ఎమ్మెల్యేగా ఉన్నారు రాపాక వర ప్రసాద్. కానీ, ఆయన సీఎం జగన్ డప్పుకొడుతున్నారు. జనసేన పార్టీ పరంగా వ్యతిరేకిస్తున్న అంశాలని రాపాక పర్సనల్ గా సపోర్ట్ చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాట్లు, ఇంగ్లీష్ మీడియం తదితర అంశాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, రాపాక మాత్రం సపోర్ట్ చేశారు. అంతేకాదు.. ఏకంగా శాసన సభలో సీఎం జగన్ పై ప్రశంసల కురిపించారు. ఈ నేపథ్యంలో రాపాక టెక్నికల్ గా జనసేన ఎమ్మెల్యే.. అయినా ఆయన వైసీపీ మద్దతుదారుని భావించాల్సి వస్తుంది.
తాజాగా రాపాక విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీతోనే ఇప్పటికీ ఉన్నానని, దగ్గరగా ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదని అన్నారు. పార్టీకి దూరంగా లేనని చెప్పిన రాపాక దగ్గరగా కూడా లేనని చెప్పడం విశేషం. అంతేకాదు.. తాను ఇప్పటికి కూడా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నానని అన్నారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని తీసుకొస్తే దాని వలన ఉత్తరాంధ్రా ప్రాంతాలు అభివఅద్ధి చెందుతాయని అన్నారు. రాపాక పరిస్థితి చూస్తే.. ఆయన కన్ఫూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వైకాపాలో చేరుదామంటే.. సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు. జనసేనలోనే ఉందామంటే.. ఇప్పటికే ఆయన పేరు బదనాం అయింది. మొత్తానికి.. రాపాకది విచిత్రమైన పరిస్థితి.