ట్విట్టర్ రివ్యూ : హిట్.. ‘కాదు బ్లాక్ బస్టర్ హిట్’ 

కొత్త దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్’. రుహానిశర్మ కథానాయికల్. నేచురల్ స్టార్ నాని బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా ఇది. తెలుగులో ఇప్పటి వరకు రానీ సస్పెన్స్ థ్రిల్లర్ తో హిట్ తెరకెక్కింది. థియేటర్స్ లో ప్రేక్షకులని మునివేళ్లపై నిలబెడుతుందని సినిమా ప్రచారకార్యక్రమాల సందర్భంగా విశ్వక్ సేన్ చెప్పాడు. మరీ.. ఇది నిజమైందా అంటే.. ? అవుననే అంటున్నారు. హిట్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్.

సినిమా చూసిన ప్రేక్షకులు టాక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలని చూస్తే.. హిట్ కాదు. థ్రిల్లర్ హిట్ అంటున్నారు. ఫర్ ఫెక్ట్ మూవీ. చాలా బాగా తీశారు. సినిమా చివరి వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేశారు. హిట్.. సూపర్ హిట్ అంటున్నారు. ముఖ్యంగా సెకాంఢాఫ్, క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సెకాంఢాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ అదిరిపోయిందని చెబుతున్నారు.

ఇక విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు. చివరిదాఖ సస్పెన్స్ కొనసాగించడం.. ప్రేక్షకులని థ్రిల్ చేయడంలో దర్శకుడు సెక్సస్ అయ్యాడు. థ్రిల్లర్ సినిమాలు.. అంతకుమించేలా హిట్ ఉందని చెబుతున్నారు. నేపథ్య సంగీతం అదిరింది. మొత్తానికి.. హిట్ పై వన్ సైడ్ టాక్. హిట్.. హిట్.. బ్లాక్ బస్టర్ హిట్. అయితే.. హిట్ విద్యార్థులకి పరీక్షల టైంలో వచ్చింది. అదొక్కటే.. ఈ సినిమా మైనస్. మిగితావన్నీ పాజిటివ్ నే.