బాలయ్య రంగంలోకి దిగాడు.. ఇక దబ్బిడి దిబ్బిడే.. !


బాలయ్య-బోయపాటిలది హిట్ కాంబో. వీరి కాంబో వచ్చిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ ఆర్ఎఫ్ సీ ఓ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్ తెరకెక్కుతోంది.

సాధారణంగా బోయపాటి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, భారీ డైలాగులు ఉంటాయి. అవి బాలయ్య చేస్తే మరో రేంజ్ లో ఉంటుంది. అందుకే సింహా, లెజెండ్ సినిమాలు ఆ రేంజ్ హిట్స్ అందుకున్నాయి. అయితే, తాజా సినిమా కోసం హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ డోస్ ని కాస్త తగ్గించేశారట. దానికి కారణం బోయపాటి గత చిత్రం ‘వినయ విధేయ రామ’ ఎఫెక్ట్ అని చెప్పుకొంటున్నారు. ఈ సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ పై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ డోస్ తగ్గించేసి.. వాటి స్థానంలో డైలాగ్స్ డోస్ పెంచాలని బాలయ్య సూచించారట. ఈ చిత్రాన్ని మిర్యాలగూడ రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.