పింక్ ఫస్ట్ లుక్.. ముందే ఉప్పెన !


‘పింక్’ రిమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరికొద్దిసేపట్లో రాబోతుంది. సాయంత్రం 5గంటలకి ముహూర్తం. అయితే గత రెండ్రోజుల నుంచే #PSPK26FirstLook యాష్ ట్యాగ్ ట్రెండ్ టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం #PSPK26FirstLookFestival యాష్ ట్యాగ్ ట్రెండ్ టాప్-3లో కొనసాగుతోంది. దీంతో #PSPK26FirstLook కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నది అర్థమవుతోంది.

అయితే, పింక్ ఫస్ట్ లుక్ కంటే ఓ గంట ముందే ఉప్పెన సాంగ్ రాబోతుంది. పవన్ కల్యాణ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జాలర్ల కథతో భారీ ప్రయోగమే చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ సహా తొలి సింగిల్ వచ్చేసింది. ఈరోజు ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ లిరికల్ వీడియో #NeeKannuNeeliSamudram రానుంది. సాయంత్రం 4:05 నిమిషాలకి ముహూర్తం. ఈ నేపథ్యంలో పింక్ ఫస్ట్ లుక్ కంటే ముందే ఉప్పెన సాంగ్ రాబోతుందని మెగా అభిమానులు చెప్పుకొంటున్నారు.

అసలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ రోజున ఉప్పెన సాంగ్ విడుదల అవసరమా ? అని కొందరు అంటుంటే.. ? తప్పెంటీ.. ? పవన్ సినిమా ఫస్ట్ లుక్ రోజున ఉప్పెన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని మరికొందరు అంటున్నారు. మరీ.. పవన్ పవర్ ముందే ఉప్పెన సాంగ్ కొట్టుకుపోతుందా? మామయ్యని ఆసరాగా చేసుకొని ట్రెండింగ్ లో నిలుస్తుందా ? అన్నది చూడాలి.