శ్రీరెడ్డితో డేటింగ్ కు వర్మ.. గ్రీన్ సిగ్నల్ !
వివాదాస్పద నటి శ్రీరెడ్డితో డేటింగ్ చేసేందుకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వర్మతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డితో డేటింగ్ పై వర్మ తనదైన శైలిలో స్పందించారు.
“డేటింగ్ అంటే డెఫినిషన్ ప్రకారం ఓ రెస్టారెంటుకో, ఇంకొక చోటుకో ఒకరితో కలిసి బయటకు వెళ్లడం. తాను ఎప్పుడూ ఓ అమ్మాయితో కలిసి బయటకు వెళ్లను. తాను వెళ్తే లోపలికే. కానీ.. బయటకు కాదు. ఇక శ్రీరెడ్డితో అయినా సరే ఇదే నా జవాబు” అన్నారు. దాంతో శ్రీరెడ్డితో డేటింగ్ కి వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
ఇక పెళ్లి కూడా వర్మ తనదైన శైలిలో స్పందించారు. పెళ్లికి, అంత్యక్రియలకు తాను రానని చెప్పానని, ఇదే తన రూల్. ఎందుకంటే.. ? తన ఉద్దేశంలో ఈ రెండు ఒకటే. ఇక్కడ మనసు చచ్చిపోతుంది. అక్కడ మనిషి చచ్చిపోతాడు అంతే తేడా అన్నారు.