‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది


పింక్ రిమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. వకీల్ సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో పవన్ తనకి అలవాటైన పుస్తక పఠనం చేస్తున్నారు. 

స్టోర్ రూమ్ లో కూర్చోని వకీల్ సాబ్ పుస్తకరం చదువుతున్నట్టు ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది. విరిగిపోయిన మంచం, విరిగిపోయిన కుర్చీలు కనిపిస్తున్నాయి. అయితే, పవన్ మాత్రం స్టయిలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ నెల 8న వకీల్ సాబ్ తొలి సాంగ్ రిలీజ్ చేయనున్నారు. మే నెలలో వకీల్ సాబ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.