స్టార్ హీరో కూతురిని పడకగదికి పిలిచారట.. !
టాలీవుడ్, కోలీవుడ్.. బాలీవుడ్ లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయిలకి ఆఫర్ల పేరిట వల వేసి.. పడకగదికి పిలిచి.. తమ కోరికలు తీర్చుకొంటున్నారు. అందుకు ఒప్పుకోని వారిని తొక్కేస్తున్నారన్నది ఆరోపణలు. అయితే, కాస్టింగ్ కౌచ్ బారిన పడుతుంది కొత్తగా వచ్చిన అమ్మాయిలే కాదు. ఇందులో స్టార్ కిడ్స్ కూడా ఉన్నారట. ఈ విషయాన్ని వరలక్ష్మీ శరత్ కుమార్ బయటపెట్టారు.
హీరోయిన్ గా రాణించి.. విలన్ గా టర్న్ తీసుకుంది వరలక్ష్మీ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.పేరుకి స్టార్ కిడ్నే అయినా.. నేనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నానని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. నేనెవరో తెలిసి కూడా నన్ను పడకగదికి రమ్మనారు. అవకాశం కోసం దర్శక నిర్మాతలతో అడ్జెస్ట్ కావాలని చెప్పారు. వాళ్లు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్.
ముందుగా అమ్మాయిలు అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. నేనే నో చెప్పాను. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. ఇటీవలే విజయవంతంగా 25 సినిమాలు పూర్తి చేశానని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇంతకీ వరలక్ష్మీ శరత్ కుమార్ ని పడకగదికి పిలిచినది ఎవరనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వారి పేర్లు బయటికొస్తే మాత్రం అంతే.. సంగతులు.. !