తమన్నా.. ఓ టపాకాయ్ !

టాలీవుడ్ లో గట్టిగా పేలిన టపాకాయ్ మిల్కీ బ్యూటీ తమన్నా. 15యేళ్లుగా పేలుతూనే ఉంది. బుధవారంతో హీరోయిన్ గా తమన్నా 15యేళ్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఆమెకి సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. స్టార్ హీరోయిన్ సమంత కూడా తమన్నాని విష్ చేసింది.

“15 అద్భుతమైన సంవత్సరాలు. అందం, కష్టించేతత్వం, నిజాయితీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో తమన్నా ఒకరు. స్క్రీన్‌ పై ఆమె ఓ టపాకాయే. ఆమె నుంచి మీ చూపును తిప్పుకోలేరు. కంగ్రాట్స్ డార్లింగ్” అని సామ్ ట్వీట్ చేసింది. దీనిపై తమన్నా స్పందిస్తూ.. ‘సమంతా… ప్రతి పనిలోనూ నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వు క్యారెక్టర్స్ ను ఎంచుకునే విధానం, వాటిని పోషించే తీరు నాకెంతో స్ఫూర్తి’ని రాసుకొచ్చింది.