నిఖిల్ సినిమా.. వెరైటీ టైటిల్ !

యంగ్ హీరో నిఖిల్ కి పెళ్లి కుదిరింది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ జోరు పెంచాడు. వరుసగా సినిమాలని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే కార్తీకేయ సీక్వెల్ మొదలైంది. తాజాగా మరో చిత్రాన్ని మొదలెట్టాడు. ఈ సినిమా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కనుంది.

ఈ చిత్రానికి `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి “18 పేజేస్” అనే వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ ఉదయమే సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి బన్నీ ముద్దుల కూతురు స్పెషల్ గెస్ట్ గా హాజరైంది.