పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ పై బీరు బాటిల్స్ తో దాడి (వీడియో)

బిగ్ బాస్ సీజన్3 విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి తీవ్ర గాయాలయ్యాయ్. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ పై బీరు బాటిల్స్ దాడి చేశాడు. ముగ్గురు, నలుగురు కలిసి చితకబాదారు. ఈ గొవకి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ గొడవకి దారి తీసిన కారణాలేంటీ ? అనేది మాత్రం తెలియరాలేదు.

ఈ గొడవపై ఇప్పటి వరకు రాహుల్ పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. ఇక ఈ గొడవకి సంబంధించిన వీదియోని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆ సమయంలో రాహుల్ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన ఏదో అంటుండగా.. ఓ వ్యక్తి బీరు బాటిల్ తో రాహుల్ తలపై కొట్టడం చూడొచ్చు. దీనిపై రాహుల్ లేదా ఆయన్ని ఎటాక్ చేసినవారు నోరు తెరిస్తే గానీ అక్కడ జరిగిన వివాదం ఏంటీ ? అన్నది తెలిసేలా లేదు.