వరలక్ష్మీ శరత్ కుమార్ క్రాక్ లుక్


గోపీచంద్ మలినేని-రవితేజ కలయికలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. గతంలో వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో క్రాక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జంటగా శృతిహాసన్ నటిస్తోంది. కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

గురువారం వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా క్రాక్ నుంచి ఆమె లుక్ ని విడుదల చేశారు. ‘జ‌య‌మ్మ‌కి హ్యాపీ బ‌ర్త్‌డే’ అంటూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని వదిలారు. ఇందులో ఆమె సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మే 8న క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.