రస్మిక.. మిలియన్ ఫాలోయింగ్ !
హీరోయిన్ రష్మిక మందన చిలిపితనానికి ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే కాంట్రాక్ట్ తీసుకుంది. ఆమె ప్రతి సినిమాకి మెగాస్టార్ గెస్ట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక స్టేజ్ మీద రస్మిక మాటలకి స్టార్ హీరోలు మహేష్, అల్లు అర్జున్ లాంటోళ్లే పడిపోయారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని ఫిదా చేసింది.
ఇక అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉండే రస్మిక ఫాలోయింగ్ పెద్దదే. తాజాగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య మిలియన్ మార్క్ అని అందుకొంది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేసింది. ‘థ్యాంక్యూ ఫర్ బిగ్ ఫ్యామిలీ. అందరికీ బిగ్ హగ్.. ‘ అంటూ ఆనందాన్ని పంచుకుంది.
నితిన్-రస్మిక జంటగా నటించిన భీష్మ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ అయింది. ఇందులో రస్మిక అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అల్లు అర్జున్ కి జంటగా నటిస్తోంది రస్మిక. ఇందులో చిత్తూరు అమ్మాయి పాత్రలో డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తుందని సమాచారమ్.
A big hug to all lovely people out there♥️,,
Thank you for a Million family !😁♥️ ,,
Blessed 🤗💕…. pic.twitter.com/RCtXneCilu— Rashmika Mandanna (@iamRashmika) March 6, 2020