కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ భేష్ : కేంద్రం
భయంకరమైన కరోనా వైరస్ భారత్ కి పాకింది. ఇప్పటి వరకు దేశంలో 30కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో కరోనాపై కేంద్రం అప్రమత్తమయింది. రాష్ట్ర ప్రభుత్వాలని అలర్ట్ చేస్తోంది. శుక్రవారం కరోనా వైరస్‌పై సమీక్షలో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమీక్షలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణపై హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు. పకడ్బందీ ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని..మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఎన్-95 మాస్క్‌లను అందించాలని, మరో కరోనా ల్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు.