ఉమామహేశ్వర ఉగ్రరూపస్య : ‘నింగి చుట్టే..’ లిరికల్ సాంగ్ 

c/o కంచరపాలెం’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడు అనిపించుకొన్నాడు వెంకటేష్ మహా. ఆయన నుంచి వస్తున్న మరో సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ‘నింగి చుట్టే..’ లిరికల్ సాంగ్ వచ్చేసింది. విశ్వ సాహిత్యం అందించిన ఈ పాటని విజయ్ యేసుదాసు పాడారు. బిజిబాల్ సంగీతం అందించారు. పాట వినడానికి ఆహ్లాదకరంగా ఉంది. ఈ పాటని మీరు ఓ సారి వినేయండీ.. !