తెలంగాణకు వర్ష సూచన
వేసవికాలం మొదలైంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయ్. ఇలాంటి సమయంలో ఉపశమనం కలిగించే ముచ్చట చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
విధర్భ నుండి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా నేడు, రేపు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వాతారణ కేంద్రం తెలిపింది.