ఈసారి టీఆర్ఎస్’కు టెన్షన్ లేదు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి టెన్షన్ లేదు. శుక్రవారం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. అయితే సభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలం ఆరు మాత్రమే. ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు ? అందుకే ఈ సారి బడ్జెట్ సమావేశాల విషయంలో టీఆర్ఎస్ పెద్దగా టెన్షన్ పడటం లేదు.

శుక్రవారం ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాలు జరిగే రోజులని పెంచాలని భట్టీ డిమాండ్ చేశారట. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. నువ్వు మాట్లాడుతుంటే వెనుకాల మీ ఎమ్మెల్యేలే ఉండరు. పనిదినాలు పెంచడం ఎందుకు..? అని కేసీఆర్ సటైర్ వేశారట.

ఇక ఈనెల 20వరకు సమావేశాలు కొనసాగించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 9, 10,15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు చర్చ, సమాధానం. ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈనెల 11, 12 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ. 12న బడ్జెట్‌పై సాధారణ చర్చకు ప్రభుత్వ సమాధానం. 13, 14, 16, 17, 18, 19 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ. ఈనెల 20న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ అనంతరం బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.