అల.. ఆల్ టైమ్ రికార్డ్ !

‘అల.. వైకుంఠపురంలో’ రికార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. ఏకంగా రూ. 200కోట్లకిపైగా షేర్ ని కలెక్ట్ చేసింది. కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. 

ఇక అల.. పాటలు సృష్టించిన రికార్డుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అల.. పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలై సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యూట్యూబ్ ఛాన‌ల్‌లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. పాన్ ఇండియా వైడ్ ఉన్న అన్ని ప్ర‌ఖ్యాత మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌పై టాప్‌ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. బాలీవుడ్ పాట‌ల‌ను వెన‌క్కి నెట్టి మరీ జియోసావ‌న్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ఆల్బ‌మ్స్‌లో టాప్ 1, 2 ,6 స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి.