బలుపు తగ్గిందా అనూ ?
అవకాశాలు వచ్చినప్పుడు ఒడిసిపట్టుకోవాలి. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలి. అలా కాదని బలుపు చూపిస్తే.. మొదటికే మోసం వస్తుంది. హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ విషయంలో ఇదే జరిగినట్టు సమాచారమ్. నాని ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అను. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సీజన్ చిత్రాల్లో నటించింది.
ఇంతలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఝాతవాసి’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. ఆ వెంటనే స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’లో ఛాన్స్ కొట్టేసింది. ఇంకేముంది ? అను స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అనుకొన్నారంతా. కానీ ఆ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో అను పత్తా లేకుండా పోయింది. సినిమాలు ప్లాప్ ఒక్కటే కారణం కాదట.. అనుకి బలుపు ఎక్కువ. షూటింగ్ సమయంలో టెక్కు చూపిస్తుంటుంది. ఆమెని భరించడం కష్టమని టాలీవుడ్ టాక్ మొదలైంది. దీంతో అనూ ఎవరు సంప్రదించడం మానేశారు దర్శక-నిర్మాతలు.
ఇటీవల తప్పు తెలుసుకున్న అనూ కాస్త తగ్గిందని తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. ఇకపై వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరీ.. అనూకి అవకాశం ఇచ్చే దర్శకుడు ఎవరు ? అన్నది చూడాలి.