సీఏఏ, ఎన్పీఆర్పై కేసీఆర్ స్పందన
దేశాన్ని కుదిపేస్తున్న సీఏఏ అంశంపై శాసనసభలో చర్చ జరగాల్సిందే అన్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో కేసీఆర్ మాట్లాడారు. సీఏఏ, ఎన్పీఆర్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై సభలో ఒకరోజు ప్రత్యేక చర్చ చేపట్టాలి.
నాకు బర్త్ సర్టిఫికెట్ కూడా లేదు. నాకే ధ్రువీకరణ పత్రం లేదంటే.. మా నాన్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నారు సీఎం కేసీఆర్. సీఏఏ బిల్లును పార్లమెంట్లో మేం వ్యతిరేకించాం. శాసనసభలో దీనిపై చర్చ జరగాల్సిందే. మన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. కానీ, దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై శాసనసభ చర్చించాల్సిన అవసరముందన్నారు సీఎం కేసీఆర్.