బడా బ్యానర్స్ చేతికి ప్రదీప్ సినిమా

యాంకర్ ప్రదీప్ పంట పండింది. ఆయన హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్నా దర్శకత్వంలో వహించారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున నాని-సుధీర్ బాబుల ‘వి’. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రదీప్ సినిమాకి థియేటర్స్ దొరకడం కాస్త కష్టమే అనే టాక్ వినిపించింది. కానీ ప్రదీప్ తంతే బుట్టలో పడ్డాడు. ఆయన సినిమాని బడా బ్యానర్స్  గీతా ఆర్ట్స్, యూవీ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ప్రదీప్ గీత మారిందని చెప్పుకొంటున్నారు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు గీతా, యూవీ ప్లాన్ చేస్తున్నాయి. సినిమా ఏమాత్రం బాగున్నా.. ప్రదీప్ సినిమా హిట్టయినట్టే.