గల్లీ నుంచి వచ్చా..డ్గిల్లీకే పోతా !
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానం భర్తీ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఆశావహులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కలిశారు.
తనను రాజ్యసభకు పంపాలని మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సీఎంను కోరారు. మీరు ఎంపీ కాబోతున్నారా? ఎమ్మెల్సీగా ఉంటారా? అని ప్రశ్నించగా.. నేను గల్లీ నుంచి ఎదిగా. డిల్లీకే పోతా అంటూ సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ప్రతిపాదిస్తున్నారట కదా? అని అడగగా ఆర్టీసీ నా నియోజకవర్గంలోనే ఉంది. నాకు ఆ పదవి ఎందుకు ? పోతే ఢిల్లీకే పోతా అన్నారు నాయిని. మరీ.. ఆయన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీకి పంపిస్తారా ? అన్నడి చూడాలి.