నకిలీ విజయ్ దేవరకొండని చూశారా ?

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండని గట్టిగా వాడుకొన్నాడు ఓ వ్యక్తి. విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి అమ్మాయిల్ని మోసం చేస్తున్నాడు. ఇది విజయ్ దృష్టికి చేరగా.. ఈసారి హీరోనే స్వయంగా రంగంలోకి దిగి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాటింగ్ చేశారు. అలాగే మెల్లగా అతన్ని ట్రాప్ చేసి.. ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫైనల్ గా నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్ చేశారు.

 విచారణలో నకిలీ విజయ్ దేవరకొండ షాకింగ్ విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. జయ్ దేవరకొండ అంటే.. అమ్మాయిలు పడిచచ్చిపోతున్న విషయాన్ని గ్రహించానని.. అందుకే ఇలా నకిలీ అకౌంట్ క్రియేట్ చేసినట్టు తెలిపాడు. అలాగో మరో ఇద్దరి హీరోల పేర్లతో కూడా అకౌంట్లు తెరిచినట్లు వివరించాడు.నకిలీ విజయ్ దేవరకొండని కామారెడ్డి జిల్లా బాన్సువాడ.