సమంత మరోసారి గర్భవతి
స్టార్ హీరోయిన్ సమంతని మరోసారి గర్భవతిని చేశారు. ‘జాను’ సినిమా రిలీజ్ కి ముందే ఇదే సమంత ఆఖరి సినిమా. ఈ సినిమా తర్వాత సమంత సినిమాలకి దూరం కానుంది. ఆమె తల్లికాబోతుందనే ప్రచారం జరిగింది. అయితే జాను సినిమా ప్రమోషన్స్ లో ఈ ప్రచారాన్ని సామ్ ఖండించింది.
ఇప్పుడు మరోసారి సమంత ప్రెగ్నెంట్ అనే న్యూస్ వినిపిస్తోంది. ఎందుకంటే ? తమిళ్ సినిమా ‘కాథు వాకులా రెండు కాదల్’ నుంచి సమంత సడెన్ ని తప్పుకుంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయన తార, సమంత ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నటించే అవకాశం దక్కినప్పుడు సామ్ ఆనందం వ్యక్తం చేసింది. అలాంటి సామ్ సడెన్ గా సినిమా నుంచి తప్పుకోవడంతో.. అనుమానాలు రేకిత్తుతున్నాయి.
ఈ సినిమా విషయంలో దర్శకుడు విగ్నేష్ శివన్.. ఆయన ప్రియురాలు నయన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందుకే సామ్ సినిమా నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సామ్ ప్రగ్నెంట్ అందుకే సినిమా నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో.. సామ్ ని రెండోసారి గర్భవతిని చేశారు గాసిప్ రాయుళ్లు అని చెప్పుకొంటున్నారు.