రేవంత్ రెడ్డి స్థానంలో రాజ్ గోపాల్ రెడ్డి ?
అతి త్వరలోనే తెలంగాణకి కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నాడు. అది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనే టాక్ ఉంది. గతంలోనే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో.. ఆ ప్రకటనని వాయిదా వేశారనే ప్రచారం ఉంది.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఖాయమైంది. ఈ నేపథ్యంలో తెరాస ప్రభుత్వం ఆయన్ని మరోసారి టార్గెట్ చేసింది. రేవంత్ రెడ్డి సోదరుల భూ దంధాలని బయటికి తీసింది. కేటీఆర్ పామ్ హౌస్ ని డ్రోన్ లతో చిత్రీకరించిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పీకల్లోతు కష్టాల్లోఇరుకున్న నేపథ్యంలో ఆయనకి పీసీసీ పోస్ట్ దక్కడం ఖాయమనే ప్రచారం ఉంది.
అదే జరిగితే రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరు ? అనే ప్రశ్న తలెత్తుతోంది. దానికి సమాధానంగా కోమట్ రెడ్డి రాజగోపాల్ పేరు వినిపిస్తోంది. శనివారం అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి స్పీచ్ విన్న తర్వాత పీసీసీ పోస్ట్ కి ఆయనే కరెక్ట్ అని కాంగ్రెస్ లోని సీనియర్లు గుసగులాడుకొన్నట్టు సమాచారమ్. మరీ.. రాజగోపాల్ రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారా? సీఎం కేసీఆర్ తో ఢీకొననున్నాడా ? అనేది చూడాలి.