మహిళలకి ‘వకీల్‌సాబ్‌’ కానుక

‘వకీల్‌సాబ్‌’గా మారాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అన్యాయానికి గురైన మహిళల కోసం గొంతు వినిపించనున్నాడు. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. బాలీవుడ్ హిట్ పింక్ సినిమాకి రిమేక్ ఇది. బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. మే 15న ప్రేక్షకుల వకీల్‌సాబ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మహిళా దినోత్సవం కానుకగా ‘వకీల్ సాబ్’ నుంచి తొలిపాట ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’ అనే  పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. థమన్ సంగీతం అందించారు. లిరికల్ వీడియలో బ్యాక్ డ్రాప్‌లో నిత్య జీవితంలో మహిళలు నిర్వర్తించే వివిధ పాత్రలతో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళల ఫొటోలను చూపించడం ఆకట్టుకుంది.